స్వచ్ఛమైన ఆవేశం ఒక్కటే సరిపోదు.. వ్యూహాత్మక ఆలోచన కూడా కావాలి

జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో పోరాట యాత్ర మొదలుపెట్టారు. దేశమంతా ఎన్నికల వాతావరణం క్రమంగా పరుచుకుంటున్న క్రమంలో పవన్ యాత్ర కూడా మీడియాలో ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 175 సీట్లలోనూ పోటీ చేస్తానని పవన్ చెప్పడం రాజకీయంగా ఆసక్తి రేపుతున్నా… ఆ వెంటనే ఉత్సాహం నీరుగారి పోయే మాటలు కూడా పవన్ నోటివెంట రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. పవన్ చేస్తున్న పరస్పర భిన్నాభిప్రాయాల సారాంశమేంటి? దాన్ని సరి దిద్దుకోకపోతే జరిగే నష్టమేంటి? ఓసారి చూద్దాం.

Pawan_Kalyan_Janasena FB

వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేన అధికారంలోకి వస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, అందువల్ల 175 సీట్లలోనూ పోటీ చేస్తామని పవన్ ప్రకటించారు. అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష జనసేనానికి ఉండడంలో తప్పు లేదు కానీ.. అందుకోసం ఒక పార్టీగా జనసేన చేయాల్సిందంతా చేస్తున్నదా అన్నదే ఇక్కడ ముఖ్యమైన అంశం. అధికార పగ్గాలు అందుకోవడం వేరే విషయం… కనీసం 175 సీట్లలో పోటీ చేసేందుకు పవన్ కోరుకునే వ్యక్తిత్వాలున్న అభ్యర్థులైనా దొరుకుతారా అన్నది ముందుగా ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే పవన్ మాటల్లో ధ్వనిస్తున్నది స్వచ్ఛ రాజకీయాలు. ఆయన పార్టీ సిద్ధాంతం కూడా చాలా విస్తృతమైన లక్ష్యాలతో కూడుకున్నది. జనసేన సిద్ధాంతంలో ఆకర్షణీయమైన 7 అంశాలున్నాయి. వాటిలో కులాలను కలిపే ఆలోచన విధానం, భాషల్ని కలిపే సంప్రదాయం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, సంస్కృతుల్ని కాపాడే సమాజం, అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం… ఇలా ఆ ఏడు అంశాలు జనసేన పార్టీని చాలా విభిన్నమైన పార్టీగా, పవన్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే సంస్థగా చూపిస్తున్నాయి.

 

అయితే అంతటి పారదర్శకత కోరుకుంటున్న వ్యక్తి కూడా ఆ వెంటనే సామాన్య కార్యకర్త లాగా అశక్తతను కూడా ప్రదర్శిస్తున్నారు. అధికారంలోకి వస్తామని అభిమానులకు భరోసా ఇస్తూ, తామెవరితోనూ పొత్తు పెట్టుకోబోమని చెబుతూనే… పార్టీని నడపడం అంత ఈజీ కాదని, తనకు హెరిటేజ్ లాంటి సంస్థ లేదని నైరాశ్యం ప్రదర్శిస్తున్నారు. ఓ పార్టీని సొంతంగా నడపడం కష్టమంటూనే, ఆ మాటకొస్తే చంద్రబాబు నడుపుతున్న టీడీపీ కూడా ఆయనది కాదంటూ తనను తాను సమర్థించుకుంటున్నారు. అంతేకాదు.. పార్టీని స్థాపించడం ద్వారా బాబు కన్నా తానే సాహసినని చెప్పుకుంటూ సమర్థించుకుంటున్నారు. పిల్లనిచ్చిన మామ స్థాపించిన పార్టీనే బాబు నడుపుతున్నారు తప్ప ఆయనకు సొంతంగా పార్టీ స్థాపించి నడిపే తెగువే లేదని చెప్పకనే చెబుతున్నారు. ఈ మాటతో పవన్ ఏం చెప్పదలచుకున్నారో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. జనసేనను సమర్థంగా నడిపే ఆర్థిక వనరులు తన వద్ద లేవని, ఆ ఖర్చులు భరించే హెరిటేజ్ లాంటి సంస్థ కూడా తనకు లేదని ప్రజలకు వివరణ ఇచ్చుకుంటున్నారు. కాబట్టి రేపటి ఎన్నికల్లో ప్రభావశీలంగా పార్టీని నడిపడం సాధ్యం కాకపోవచ్చన్న సంకేతం పంపుతూ.. మరోవైపు అధికారంలో వస్తానని మాత్రం చెప్పడం విడ్డూరమే.

 

ఏపీలో ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా ప్రత్యేకమైన పరిస్థితులున్న క్రమంలో పవన్ లాంటి స్వచ్ఛతతో కూడిన ఆవేశపరుడికి జనాదరణ ఉంటుందన్నది నిర్వివాదాంశం. అయితే పవన్ ఆవేశంలో ఉండే స్వచ్ఛతకు దీర్ఘకాలిక వ్యూహంతో కూడిన ఆలోచన లేకపోవడం అతిపెద్ద మైనస్ పాయింట్ గా నిపుణులు భావిస్తున్నారు. చంద్రబాబు-మోడీల మోసపూరిత ఎత్తుగడల మీద రాజకీయ లబ్ధి పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ప్రచారంలో కానీ, బాబును ఇరుకున పెట్టడంలో కానీ జగన్ చాలావరకు సక్సెస్ అవుతున్నారు. మరోవైపు జగన్ కు ఫక్తు అధికారం మీద ఉండే యావ పవన్ కు లేకపోవడం జనసేనానికి కలిసొచ్చే అంశం. అయితే అధికార పార్టీలకు సవాల్ విసరగలిగే స్థానంలో ఉండే పవన్… మాటిమాటికీ నైరాశ్యం ప్రదర్శించడం మంచిది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే తన గురించి, తన పార్టీ భవిష్యత్ గురించి పూర్తి స్థాయిలో వ్యూహాలు రచించగల అనుభవజ్ఞులను పవన్ నియమించుకోవాలి. అంత మాత్రానే సరిపోదు. అలా నియమించుకున్నవారికి మనసు విప్పి మాట్లాడగలిగే స్వతంత్రం కూడా ఇవ్వాలి. అంతేకానీ.. తనకే సలహాలిస్తే తన పవనిజానికి ఎక్కడ విఘాతం కలుగుతుందోనన్న సంకుచిత దృష్టి విడనాడాలి. ప్రజలంతా ఆత్మీయంగా ఆహ్వానిస్తున్న సందర్భాన్ని బేరీజు వేసుకొని, డబ్బు కోసం చూడకుండా ప్రజల కష్టసుఖాలతో మమేకమైతే.. పవన్ పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పొచ్చు.

Advertisements

అధికారం కోసం అర్ధరాత్రులు సైతం

Abhishek

మన దేశ రాజకీయ నాయకులు పవర్ కోసం ఎంతదూరమైనా పాకులాడుతారనేందుకు కర్నాటక ఘటనే తాజా ఉదాహరణ. అధికార పగ్గాలు తమ చేతుల్లోంచి జారిపోతున్నప్పుడో, అవతలిపక్షం ఎగరేసుకుపోతుందని తెలిసినప్పుడో మన నేతాశ్రీలు చేసే హడావుడి మామూలుగా ఉండదు. కర్నాటకలో మెజారిటీ మార్కు వస్తుందనుకున్న బీజేపీ నేతల బండి 104 దగ్గరకు వచ్చి ఆగిపోయింది. అధికారం నల్లేరుమీద నడక కాకపోయినా అతిపెద్ద పార్టీ తామేనన్న ధీమాతో ఆపరేషన్ ఆకర్ష్ మీద అర్జంటుగా దృష్టి సారించలేకపోయారు. దీన్ని ముందే ఊహించిన కాంగ్రెస్ నేతలు ఢిల్లీ నుంచి ఒకరోజు ముందే బెంగళూరు చేరుకొని చేయాల్సిన పనుల్లో నిమగ్నమైపోయారు. వారు సొంతంగా చేయించుకున్న సర్వేలో 111 సీట్లు వస్తాయని తేలిందట. దీంతో ఆ నెంబరు ఎటైనా మారొచ్చు అన్న ముందుచూపుతో కాంగ్రెస్ నేతలు ముందే బెంగళూరులో వాలిపోయారు. ఫలితాలు వెలువడుతున్న క్రమంలోనే జేడీ(ఎస్) తో సంప్రదింపులు షురూ చేశారు. ఇద్దరి మధ్యా పొత్తు నిభాయించుకొని 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఆ రాత్రే ఆగమేఘాల మీద గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాల్సిందిగా లేఖను సమర్పించారు.

ఇక అతిపెద్ద పార్టీ అన్న అభిప్రాయంలో ఉన్న బీజేపీ నేతలు నిదానంగా మరుసటి రోజు గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. దీంతో 17 ఉదయం 9.30కే యడ్యూరప్ప చేత ప్రమాణ స్వీకారానికి గవర్నర్ వజూభాయ్ వాలా ముహూర్తం ఖరారు చేశారు. అంతేకాదు… మెజారిటీ నిరూపించుకునేందుకు 15 రోజుల సమయం కూడా యడ్యూరప్పకు ఇచ్చారు. కాంగ్రెస్ నేతలకు కనీసం కోర్టుకెళ్లే సమయమైనా దక్కకుండా చేయాలన్న ఎత్తుగడ ఇందులో ఉందన్నది నిర్వివాదాంశం. అయితే కాంగ్రెస్ నేతలు అనూహ్యంగా 16వ తేదీ రాత్రే సుప్రీంకోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్ దాఖలు చేశారు. కర్నాటకలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందని, యడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవాలని కోరారు. అయితే గవర్నర్ నిర్ణయాన్ని అడ్డుకోజాలమని కోర్టు తేల్చేసింది. అయితే ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంలో పడుతుందన్న భావన వెల్లువెత్తుతున్న దృష్ట్యా తదుపరి పరిశీలన ఉంటుందని భరోసా ఇచ్చింది. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం అడ్డుకోకపోవడంతో కాంగ్రెస్ నేతల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ఈ సందర్భంగానే భారత న్యాయ వ్యవస్థ పాకిస్తాన్ ను తలపిస్తోందంటూ రాహుల్ అక్కసు వెళ్లగక్కారు.

తదుపరి విచారణను 18వ తేదీకి వాయిదా వేసిన కోర్టు 19వ తేదీ సాయంత్రమే బలనిరూపణ చేసుకోవాలన్న షరతు విధించింది. దీంతో యడ్యూరప్పకు గవర్నర్ ఇచ్చిన 15 రోజులను సుప్రీంకోర్టు కుదించినట్టయింది. అయితే ఈ విషయంలో గవర్నర్ ను ప్రతివాదిగా చేర్చడం లేదని, ఆయన జవాబుదారీ కాదని కోర్టు పేర్కొనడం వేరే విషయం. బీజేపీ నేతలు కోరిన 21వ తేదీ గడువును కానీ, రహస్య ఓటింగ్ అంశాన్ని కానీ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఈ బలపరీక్షలో ఎవరు నెగ్గుతారు, ఎవరిని విజయలక్ష్మి వరిస్తుందన్నదే వేరే విషయం.

కానీ… మన రాజకీయ నాయకులు అధికారం మీద చూపించే శ్రద్ధ పాలనలో కానీ, ప్రజాసంక్షేమంలో కానీ చూపించడం లేదన్నవిషయం అర్థమవుతోంది. తమ కుర్చీల కోసం అర్ధరాత్రి అయినా సరే కోర్టు మెట్లెక్కుతారు. ప్రపంచం మునిగిపోతున్నట్టు జడ్జీలను మేల్కొలిపి హడావుడి చేస్తారు. ఇక ప్రజల్లో ప్రజాస్వామ్యం మీద నమ్మకం పెంచాలన్న ఉద్దేశంతో కోర్టులు కూడా లీడర్ల పిటిషన్లను స్వీకరించక తప్పడం లేదు. మరి కోర్టులు ఇంత చేసినా కనీసం న్యాయవ్యవస్థ మీదనైనా మన నాయకులకు నమ్మకం ఉందా అంటే అదీ లేదు. ఇక ఎన్నికల సమయంలో విడుదల చేస్తున్న మేనిఫెస్టోల్లో ఎన్నింటిని అమలు చేశారు… ఎంతవరకు హామీలు నెరవేర్చారు అన్న విషయంలో వారికేమీ పట్టింపుల్లేవు. కేవలం అధికారం విషయంలో, కుర్చీ విషయంలోనే వారికి అలవిమాలిన ప్రేమ ఉందని సామాన్య పౌరుడు అనుకుంటున్నాడు. మరి నాయకులంతా సామాన్యుడి అభిప్రాయాన్ని ఎప్పుడు మారుస్తారో చూడాలి.

 

– టి.రమేశ్ బాబు, జర్నలిస్ట్

కర్ణాటకలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందా? ఎంతవరకు?

మన దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని పెడబొబ్బలు పెట్టేవాళ్లు ఈ విషయం పూర్తిగా ఆలకించాలి. నిజమే మనది ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకోవడానికి ఎంత గర్వపడతామో అదే స్థాయిలో అప్పుడప్పుడూ ఇదేం ప్రజాస్వామ్యం అనిపిస్తుంది కూడా. ఇక కర్నాటక విషయానికొస్తే అక్కడ ప్రజాస్వామ్యం ఏమీ ఖూనీ అయిపోలేదు. ప్రజానిర్ణయం రూపంలో అది చెక్కు చెదరకుండా భద్రంగానే ఉంది. అయితే ఈ ప్రజాస్వామ్యం అనేది అందరికీ సంబంధించిన పదార్థం కాబట్టి ఎవరికి ఎంత అవసరరమో అంత మాత్రమే తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి ఏ ఒక్కరి మాటల్లో కూడా సామాన్యపౌరుడు కన్విన్స్ అయ్యే పూర్తి స్థాయి ప్రజాస్వామ్యం కనిపించదు. ఎందుకంటే సామాన్య పౌరుడు పూర్తి మెజారిటీ ఎవరికీ ఇవ్వలేదు కదా.. అందుకు.

yeddyurappa-takes-oath-as-CM-1

కర్నాటక ప్రజాస్వామ్య రంగస్థలం మీద ప్రధాన పాత్రధారులు నలుగురు. ఆ నలుగురిలో గవర్నర్ ను పాత్రధారిగా కాక మార్కులేసే జడ్జిగా పరిగణిద్దాం. ఇక మిగిలిన ముగ్గురిలో కాంగ్రెస్, బీజేపీ, జేడీ(ఎస్). ఈ నలుగురు కూడా ఎవరు ఎంత మేరకు ప్రజాస్వామ్యాన్ని వాడుకోవాలో అంతా వాడుకునేందుకే ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకుంటే ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండదు. అదెలాగో చూద్దాం.

మొదటగా బీజేపీ విషయానికొద్దాం. 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది కాబట్టి తనకు పగ్గాలు అప్పగించడమే ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతుందని ఆ పార్టీ చెబుతోంది. లాజికల్ గా చూసినా, గవర్నర్ ముందుండే తొలి ప్రాధాన్యం దృష్ట్యా చూసినా ఇది కరెక్టే. ఇక ఎన్నికల తరువాత ఒప్పందం కుదుర్చుకున్న కాంగ్రెస్-జేడీఎస్ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్కు తమ దగ్గరే ఉంది కాబట్టి తమకే అవకాశం ఇవ్వాలంటున్నారు. లాజిగ్గా చూస్తే ఈ వాదన కరెక్టే. కానీ గవర్నర్ ముందున్న ఆప్షన్స్ లో ఇది మూడో ప్రాధాన్యంలోకి వెళ్లిపోతుంది. ఈ ఇద్దరు ఎన్నికలకు ముందే పొత్తు కుదుర్చుకొని కూటమిగా ఎన్నికలు ఎదుర్కొంటే వారిని ఒక్క జట్టుగా గవర్నర్ భావించి ఉండేవారు. అప్పుడది రెండో ప్రాధాన్యంగా ఉండేది. కానీ అప్పటిదాకా తిట్టుకొని అధికారం కోసం, అవసరం కోసం ఒక్కటైపోయి, నెంబర్ గేమ్ లో నెగ్గాం కాబట్టి పగ్గాలు అప్పగించాలనేపాటికి అది మూడో ఆప్షన్ గా మారిపోయింది. మొదటి రెండు ఆప్షన్లను కాదని మూడో ఆప్షన్ కు మొగ్గు చూపడం సామాన్యుడికే కన్విన్సింగ్ గా లేదు. మరి… గవర్నర్ వంటి రాజ్యాంగ పదవుల్లో ఉండే వ్యక్తి ఏ విధంగా కన్విన్స్ అవుతాడనేది ప్రశ్న? ఆ రెండు పార్టీలూ కనీసం రెండో ప్రాధాన్యతాంశంగా కూడా మారలేకపోయినప్పుడు గవర్నర్ ఎటువైపు మొగ్గు చూపితే బెటరో ఆలోచించేవారికి అర్థమైపోతుంది.

 

గవర్నర్ ఎమ్మెల్యేల నెంబర్ చూసుకొని టిక్ కొడితే సరిపోతుందా?
నిజమే. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతుందని పెడబొబ్బలు పెట్టేవారు ఎమ్మెల్యేల నెంబర్ చూసుకొని గవర్నర్ టిక్ కొడితే సరిపోతుందంటున్నారు. అంటే ప్రజాస్వామ్యం పతనమైపోతుందనేవారే.. ఒక ప్రజాస్వామ్య దేశం గవర్నర్ కు కల్పించిన ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశాన్ని, అధికారాలను ప్రజాస్వామ్య ఖూనీగా అభివర్ణిస్తున్నారు. ఈ ద్వైదీ భావమే మన దేశ ప్రజాస్వామ్యానికి అసలైన ప్రమాదమంగా భావించాలి. కన్నడ పౌరుడు జేడీఎస్ ను గానీ, కాంగ్రెస్ ను గానీ ఆమోదించలేదు. ఆ మాటకొస్తే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను గద్దె దింపారు కూడా. పరస్పరం తిట్టిపోసుకున్న రాజకీయ శత్రువులు, ఒకరి కొంపలు ఒకరు కూల్చేందుకైనా వెనుదీయనివారు ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా, తాము తీర్పు ఇచ్చాక కూటమి కట్టి తమనే పరిపాలిస్తామంటే అది ఏ విధమైన ప్రజాస్వామ్య పరిరక్షణ అవుతుంది?

 

NTR and MLAS_Delhi
రాష్ట్రపతి భవన్ ముందు ఎన్టీఆర్ ఆనాడు పరేడ్ చేయించిన ఎమ్మెల్యేలు

మరొక్క మాట

ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ను వంచించి టీడీపీని చీల్చి నాదెండ్ల భాస్కర్ రావు చేసిన చర్యను ఓసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. కేంద్రంలోని ఆనాటి ఇందిరాగాంధీ సర్కారు 20 నెలల ఎన్టీఆర్ ప్రభుత్వం మీద కన్నేసింది. రాంలాల్ ద్వారా కుట్ర నడిపి నాదెండ్ల భాస్కర్ రావును ముఖ్యమంత్రిని చేసి తన చెప్పుచేతల్లో ఉండే ప్రభుత్వం నడపాలనుకుంది. ఇందుకోసం నాదెండ్లకు గవర్నర్ రాంలాల్ పూర్తిగా సహకరించాడు. అవసరమైతే ఆనాడు ఎన్టీఆర్ ను హతమార్చాలన్న కుట్ర జరిగినట్లు కూడా ఆనాడు వార్తలొచ్చాయి. సర్కారు కూలిపోయిన తరువాత జరిగిన నిరసనల్లో భారీ ఎత్తున ప్రభుత్వాస్తులకు నష్టం జరిగింది. 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో ఆపరేషన్ చేసుకుని వచ్చిన ఎన్టీఆర్ ఢిల్లీలో ఎమ్మెల్యేల చేత పరేడ్ చేయించాల్సి వచ్చింది. ఆయన్ని రాష్ట్రపతి భవన్ కు వీల్ చైర్లో తీసుకెళ్లారట. అదీ కాంగ్రెస్ హయాంలో గవర్నర్లు చేసిన నిర్వాకం. ఇక తాజా కర్ణాటక ఎపిసోడ్ లో గవర్నర్ బీజేపీకి చెందిన వ్యక్తే అయినా.. లాజికల్ గా పొరపాటు నిర్ణయం తీసుకోలేదని నా భావన. తన దగ్గరున్న ఆప్షన్ మాత్రమే వాడుకున్నారు. ఆ తరువాత మెజారిటీ నిరూపించుకోవడం, నిరూపించుకోలేకపోవడం గవర్నర్ పరిధిలోని అంశం కాదు. రాజ్ భవన్ బయట జరిగే రాజకీయాలతో తనకు సంబంధం ఉండాల్సిన పని లేదు. ఇక ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అవకాశం చేజేతులా ఇచ్చాడనేవి రాజకీయ ఆరోపణలే. ఎవరి ఆరోపణలు వారు చేసుకోవచ్చు. అది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని ఎవరు ఎంత వాడుకోదలచారో అంత వాడుకోవచ్చు. అది ప్రజాస్వామ్యంలో ఉండే సౌలభ్యం. మేం చెప్పేదే ప్రజాస్వామ్యం, మిగతాది అప్రజాస్వామ్యం అనే వాదనే మోసపూరితం. ప్రతి ఒక్కరికీ ఆప్షన్స్ ఉంటాయి. పార్టీలకు ఆప్షన్స్ ఉన్నట్టే గవర్నర్లకు కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఎంత రబ్బర్ స్టాంపు పదవి అయినా కీలకమైన సమయాల్లో చక్రం తిప్పే అవకాశం కల్పించారు. అయితే ఆప్షన్స్ ను వాడుకోవడం వేరు… దురుపయోగం చేయడం వేరు. దురుపయోగం చేస్తున్నప్పుడు మౌనంగా ఉండడమే అప్రజాస్వామికం, అనైతికం, అపాత్రికేయం.

– టి.రమేశ్ బాబు, జర్నలిస్ట్

కర్నాటక గవర్నర్ లాజిక్ ఫాలో అవుతారా? ఆత్మసాక్షిని అనుసరిస్తారా?

కర్నాటకలో ఎవరు పవర్లోకి వస్తారు? ఆ రాష్ట్ర గవర్నర్ ఎవరికి పగ్గాలు అప్పగిస్తారు అన్నది తేలడానికి మరికొన్ని గంటల సమయం ఉంది. ఈలోగా గవర్నర్ ఏం చేయడానికి అవకాశం ఉందో ఓసారి అంచనా వేద్దాం.

Vajubhai-Rudabhaదేశమంతా ఎదురుచూస్తున్న కర్నాటక ఫలితాల విషయంలో గవర్నర్ కూడా అంతే ఒత్తిడికి గురయ్యే అవకాశం ఏర్పడింది. గవర్నర్ ఎవరి వైపు మొగ్గు చూపినా అవతలి వర్గం అసంతృప్తి చెందడమే కాక ఆగ్రహిస్తుంది కూడా. అయినా గవర్నర్ ఏదో నిర్ణయం తీసుకోక తప్పదు. మొత్తమ్మీద చూస్తే గవర్నర్ ముందు ప్రధానంగా నాలుగు మార్గాలున్నట్లు భావించవచ్చు. అవి 1) అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీని బలం నిరూపించుకోవాల్సిందిగా ఆహ్వానించడం, 2) మెజారిటీ గల కూటమికి (కాంగ్రెస్-జేడీఎస్) ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వడం, ౩) మెజారిటీ గల కూటమిని ఆహ్వానించి బలం నిరూపించుకొమ్మని ఆదేశించడం, 4) అతిపెద్ద (బీజేపీ), రెండో అతిపెద్ద (కాంగ్రెస్) పార్టీల మధ్య గవర్నర్ టాస్ వేయడం. అయితే టాస్ వేయడాన్ని యథాతథంగా అదే అర్థంలో కాకుండా గవర్నర్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి తీసుకునే నిర్ణయంగా భావించాలి. అవి కాకుండా మరో రెండు మార్గాలు కూడా ఉన్నాయి. అవేంటంటే… ఎన్నికలకు ముందే కూటమి కట్టి పోటీ చేసిన పార్టీల సంఖ్యా బలాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవచ్చు. కానీ కర్నాటకలో ఏ పార్టీ కూడా మరో పార్టీతో ప్రీ అలయెన్స్ పెట్టుకోలేదు. సంఖ్యాబలం ఎవరికీ రాలేకపోవడంతో పోస్ట్ అలయెన్స్ కు కాంగ్రెస్-జేడీ(ఎస్) ముందుకొచ్చాయి. కాబట్టి గవర్నర్ దీన్ని కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఆయన ముందున్న ఐదారు మార్గాల ముందు ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కువుంది అనేదే ఇప్పుడు జరగుతున్న చర్చ.

గతేడాది గోవా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించినా రెండో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. సరిగ్గా అలాంటి పరిస్థితే కర్నాటకలో ఎదురైంది. అయితే గోవాలో ఎదురైన చేదు అనుభవం రిపీట్ కాకుండా ఉండేందుకు కాంగ్రెస్ నేతలు పట్టుదలగా, ఎంతో జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. 40 సీట్లున్న గోవా అసెంబ్లీలో బీజేపీకి 13 సీట్లు, కాంగ్రెస్ కు 17 సీట్లు వచ్చాయి. అయితే ఆ సమయంలో బీజేపీ చాలా అలర్టుగా వ్యవహరించింది. అంతకుముందే సీఎంగా పనిచేసిన మనోహర్ పారికర్.. ప్రాంతీయ పార్టీలతో, ఇండిపెండెంట్లతో ముందే సంప్రదింపులు జరిపి గవర్నర్ ని ముందుగా కలిశారు. తగిన సంఖ్యాబలంతో వచ్చిన బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని గవర్నర్ కల్పించారు. అప్పటిదాకా నిమ్మకు నీరెత్తినట్టున్న కాంగ్రెస్ నేతలు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే సుప్రీంకోర్టుకు వెళ్లారు. గోవా అసెంబ్లీలో అతిపెద్ద పార్టీ తమదే కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వకుండా గవర్నర్ బీజేపీకి ఎలా ఇస్తారంటూ ఫిర్యాదు చేశారు. అసలీ విషయాన్ని కోర్టు గడపతొక్కే ముందే గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారా అని కోర్టు అడిగింది. దీనికి వారి దగ్గర జవాబు లేదు. మీరు గవర్నర్ ని అడగకుండా కోర్టుకు రావడంలో అర్థం లేదంటూ ఆ ఫిర్యాదును కోర్టు తిరస్కరించింది.

తాజాగా కర్నాటకలో కూడా గోవా పరిస్థితే ఎదురవడంతో మరోసారి అలాంటి తప్పిదం జరగకుండా కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గోవాలో బీజేపీ ఎలా ఏర్పాటు చేసిందో తామూ అలాగే ఏర్పాటు చేసి, బీజేపీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో గవర్నర్ వజూభాయి పాత సంప్రదాయాన్నే పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నారు. అలాంటి నిర్ణయానికి భిన్నంగా వ్యవహరిస్తే కోర్టుకు వెళ్లేందుకూ ప్లాన్ చేస్తున్నారు. గవర్నర్ మీద మరింత ఒత్తిడి పెంచేందుకు ఎమ్మెల్యేల చేత పరేడ్ నిర్వహించాలని భావిస్తున్నారు. అందుకోసం ఎమ్మెల్యేలను బీజేపీ వారు ఎగరేసుకు పోకుండా క్యాంపులకు తరలించారు. కోడిపిల్లల్ని గద్దలు తన్నుకుపోకుండా తీసుకునే జాగ్రత్తల్లాంటివన్నమాట. అప్పటికీ గవర్నర్ శైలి అనుమానాస్పందా కనిపిస్తే మరింత ముందు జాగ్రత్తతో వ్యవహరించి, ఎమ్మెల్యేలను రిసార్ట్స్ నుంచే నేరుగా రాష్ట్రపతి వద్దకు తీసుకెళ్లి పరేడ్ చేయించే యోచన కూడా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కర్నాటక గవర్నర్ ఎలా వ్యవహరిస్తారో తేలాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

ఇక మరో ముఖ్యవిషయం ఏంటంటే.. ఇలాంటి పరిస్థితులు గతంలో గోవా, మణిపూర్లోనే కాదు.. అనేక రాష్ట్రాల్లో తలెత్తాయి. 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 31 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ(28), కాంగ్రెస్ (8) జత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2005లో జార్ఖండ్ లో బీజేపీకి 30 సీట్లు వచ్చినా 17 సీట్లు గెలుచుకున్న జేఎంఎం కు మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దక్కింది. 2002లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉత్పన్నమైంది. 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచిన నేషనల్ కాన్ఫరెన్స్ కు పగ్గాలు దక్కలేదు. 16 సీట్లు గెల్చుకున్న పీడీపీ 20 సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్, మరో స్థానిక పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో వాజ్ పేయి హయాంలో కేంద్రంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా నేషనల్ ఫ్రంట్, లెఫ్ట్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం మరువరాదు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుంటే గవర్నర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చెప్పడం కష్టమే. కాబట్టి గవర్నర్ తార్కికంగా ఆలోచించడం కంటే వ్యక్తిగత విచక్షణాధికారం ఉపయోగించుకునే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని చెప్పవచ్చు. అంటే గవర్నర్ ఆత్మసాక్షి మేరకు నడచుకోవచ్చన్నమాట.

Because the NATION WANTS

trameshbabu

arnab copy

It is very interesting to anybody to know how republic tv achieved the top position among Indian news channels just in 12 days of its launching and remaining top till date. For that matter any regular prime time viewer might have eagerly awaited for those 6 months in which Arnab Goswami has not on the screen. As well expected of, Arnab Goswami re-entered with a big debate on 6th May, 2017 on Republic tv. That particular day’s issue was targeting the Bihar Politicians with a sting operation which was even unexpected by a regular viewer. The Sting Operation (SO) had revealed the true colors of RJD leader Laluprasad Yadav, who has close links with Shahabuddin in which the audio tapes revealed Shahabuddin’s alliance with terrorists. Shahabuddin, a former MP of Sivan, a criminal-turned-politician, when he was in jail, had a phone conversation with Lalu about how to deal with the…

View original post 470 more words

Because the NATION WANTS

arnab copy

It is very interesting to anybody to know how republic tv achieved the top position among Indian news channels just in 12 days of its launching and remaining top till date. For that matter any regular prime time viewer might have eagerly awaited for those 6 months in which Arnab Goswami has not on the screen. As well expected of, Arnab Goswami re-entered with a big debate on 6th May, 2017 on Republic tv. That particular day’s issue was targeting the Bihar Politicians with a sting operation which was even unexpected by a regular viewer. The Sting Operation (SO) had revealed the true colors of RJD leader Laluprasad Yadav, who has close links with Shahabuddin in which the audio tapes revealed Shahabuddin’s alliance with terrorists. Shahabuddin, a former MP of Sivan, a criminal-turned-politician, when he was in jail, had a phone conversation with Lalu about how to deal with the police administration, when any unexpected situation occurs in his constituency.

How republic tv got its first place within no time?

The very beginning debate on Republic tv, Arnab Goswami has questioned the CM of Bihar, who is being considered as would be Prime Minister of India, whether he will react against his co-ruler Lalu or not. That was a big blow to those who are making efforts to pull up the parties against NDA or for a third front. The following up of the debate went on for three to four days, but neither Nitish nor Lalu has come forward to make a statement on that SO. The result of the debate has delivered after 20 days as Nitishkumar had to attend the meeting with Sonia Gandhi with fellow friends but was evaded by. There did not end the matter. More over Nithish kumar had met with the PM Modi on the same day, same time and had meals with him. Who can expect than this major chunk in Indian politics?

Arnab’s tv revelations are Sunanda pushkar’s suspicious death case’s audio tapes, Hyderabad youth links with ISIS, the paid works of stone pelters in Srinagar, the real fabric of Rahulgandhi’s tour to Mandasaur in MP, the Muslim Mullah Barkati’s anti nationalist and pro terrorist stand and many more alike. Most of the debates are well sketched and pre-worked in the national interests. Why not anybody can be unwatched these well anticipated and hyper extensive debates? For that reason anybody can understand that Arnab’s channel might have got the highest tweets in the beginning week itself. And the Channel’s position is becoming better and better as the debates are getting more and more eyeball grabbers. The result of the BARC (Broadcast Audience Research Council) shows the Republic tv is topper than all the national channels together.

Coming to Telugu media, in Hyderabad there are nearly 20 satellite news channels besides with the number of cable channels. But it seems like no channel has the guts to make a sting operation on ISIS links against having a good network and well trained crew in comparison with the new one of Republic tv. According to news, many of the analysts say, one who watches any Telugu channel, there is no need to watch another one. That is the news and debating trend going on in Telugu media. In getting the TRP ratings also the Telugu media has the allegations of bad and unethical practices. Still the Telugu channels are, it seems not interested to re-correct themselves in establishing the good traditions.

Here it is noteworthy that the content whoever is airing is not important but which is being aired. Finally the ultimate king of the TRP is the viewer alone, not the Channel’s management or anybody else.

  • T. Rameshbabu
  • Mob: 9032003022
  • Email: rameshbabut@hotmail.com

భూకంపం పడగనీడలో బంగ్లాదేశ్


భారత ఉపఖండం కింద భూమి పొరలు ప్రమాదకరంగా కదులుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపానికి దారితీసే సంకేతాలు కనిపిస్తున్నాయని జియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. 12 ఏళ్ల సుదీర్ఘ అధ్యయనాల ఫలితంగా వారీ నిర్ధారణకు వచ్చారు. ఉపఖండం ఈశాన్య భాగంలోని
సుమారు 140 మిలియన్ల ప్రజలు ఒక ఊబి లాంటి అందమైన పొర మీద ప్రమాదకరంగా జీవిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
                 కొలంబియా యూనివర్సిటీకి చెందిన మైకేల్ స్టెక్లర్ అనే జియాలజిస్టు నేతృత్వంలోని కొందరు శాస్త్రవేత్తల బృందం2003 నుంచి 2014 వరకు ప్రత్యేకంగా బంగ్లాదేశ్ జోన్ మీద అధ్యయనం చేశారు. భారత ఉపఖండంలోని భూ కదలికలను అర్థం చేసుకునేందుకు బంగ్లాదేశ్ ను యూనిట్ గా తీసుకొని అధ్యయనం మొదలుపెట్టారు. అందుకోసం బంగ్లాదేశ్ అంతటా గుర్తించిన పలు ప్రదేశాల్లో 26 జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ లను ఏర్పాటు చేశారు. అలా బంగ్లాదేశ్ అడుగున దక్షిణ భూభాగంలో కదలికలను గమనించడం ద్వారా భారత ఉపఖండం కదలికలను అంచనా వేయగలిగారు. వారి అధ్యయనాలు భారత్, మయన్మార్, మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్ ప్రజలకు పెనుప్రమాదం పొంచి ఉందని తేటతెల్లం చేస్తున్నాయి. వారి పరిశోధనలు నిజమైతే 2011లో జపాన్లో సంభవించిన భారీ భూకంపం (రిక్టర్ స్కేలుపై 9.0) లాంటి ఉపద్రవం సంభవించే అవకాశం ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపంగా నమోదు కావచ్చు.
            indian plate   400 ఏళ్ల క్రితం నుంచే భూమి పొరల్లో ఒత్తిళ్లు సంభవిస్తున్నట్లు జియాలజిస్టులు గుర్తించారు. అంటే మన దేశంలో మొఘలులు పాలిస్తున్న కాలంలో (క్రీ.శ. 1600 ప్రాంతం)నే ఈ సర్దుబాట్లు ప్రారంభమయ్యాయన్నమాట. భారత ఉపఖండ భాగం ఆసియా భూభాగంతో చాలా చురుగ్గా ఢీకొంటోంది. అంటే తూర్పు, ఈశాన్య ప్రాంతంలోని దాదాపు 200 కి.మీ. మేర భూమి పొరలు (టెక్టానిక్ ప్లేటు) స్ప్రింగుల్లాగా ఒత్తిళ్లకు గురవుతూ ఒరుసుకుంటూ సర్దుబాటు అవుతూ వస్తున్నాయి. ఈ ఒత్తిడి గనక ఒక్కసారిగా అదుపు తప్పితే.. పూర్తి ఏమరుపాటుగా ఉన్న ప్రాంతం మొత్తం తుడిచిపెట్టుకుపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఆ ఒత్తిడి అదుపు తప్పడం అనేది ఎప్పుడు జరుగుతుందో చెప్పడం కష్టమంటున్నారు భూకంప నిపుణులు. ఈ ప్రాంతమంతా ఒక్క భూకంపానికే గురవుతుందా లేక వరుస భూకంపాలు సంభవిస్తాయా అన్నది చెప్పలేమని వినీత్ గెహ్లట్ అనే జియాలజిస్టు చెబుతున్నారు.
                     ఈ అధ్యయనంలో తేలిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 40 మిలియన్ల సంవత్సరాలుగా భూరత ఉపఖండం టెక్టానిక్ ప్లేటు ఆసియా ఖండం టెక్టానిక్ ప్లేటులోకి చొచ్చుకుపోతూ వస్తోంది. అంటే హిమాలయాలు ఉన్న భూభాగంలోకి మరింతగా చొచ్చుకుపోతోందన్నమాట. భూగర్భంలో చోటు చేసుకునే ఈ సర్దుబాట్లవల్లనే ఎత్తయిన పర్వతాలు, లోయలు వంటివి ఏర్పడతాయని జియాలజిస్టులు చెబుతూ వస్తున్నారు. ఇందువల్లనే హిమాలయాలు తీవ్రమైన క్రమక్షయానికి గురవుతున్నాయని, ఆ శిథిలాలన్నీ గంగా, బ్రహ్మపుత్రా నదుల్లోకి చేరి బంగాళాఖాతంలోకి ఏటా బిలియన్ టన్నుల దాకా చేరిపోతోందట. అలా కొట్టుకు వచ్చిన శిథిలాల కారణంగానే బంగ్లాదేశ్ వద్ద ఖండపు అంచులు దాదాపు 400 కి.మీ. దాకా పెరిగినట్లు ధ్రువీకరించారు. నదుల ద్వారా కొట్టుకొచ్చి మేట వేసి  డెల్టాలుగా ఏర్పడ్డ ప్రాంతం సారవంతమైన ప్రాంతంగా ఉంది. ఢాకా చుట్టూ ఈ సారవంతమైన భూముల్లో 14 మిలియన్ల మంది ప్రజలున్నారు. ఈ సెడిమెంట్ల వల్ల భూకంప తీవ్రత చాలారెట్లు పెరుగుతుందని చెబుతున్నారు.
                             వెలుగుచూసిన కొత్త సంగతులు
                       బంగ్లాదేశ్ జీపీఎస్ ల ద్వారా వచ్చిన సమాచారాన్ని, ఈశాన్య భారత్, మయన్మార్ జోన్లలో అంతకుముందే చేసిన పరిశోధనలతో పోల్చి చూశారు. మయన్మార్ ప్లేట్ నైరుతి దిశగా కదులుతున్నట్టు గుర్తించారు. ఈ కదలిక భారత ఉపఖండానికి అనుగుణంగా ప్రతియేటా 51 మిల్లీ మీటర్లు (సుమారు 2 ఇంచులు) మేర కదులుతోంది. చాలా సంక్లిష్టమైన ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలకు మరో సంగతి తెలిసొచ్చింది. ఈశాన్య భారత్, బంగ్లాదేశ్ జోన్ లో కదలికల్ని మదింపు వేస్తున్న క్రమంలో.. భారత ఉపఖండం కిందనున్న టెక్టానిక్ ప్లేట్ చాలా చురుగ్గా యూరేషియా ప్లేట్ కిందికి జారుకుంటోందని గుర్తించారు. దాని వేగం ఏటా 0.51 నుంచి 0.67 ఇంచుల దాకా (13 నుంచి 17 మిల్లీ మీటర్లు) ఉంటోందని నిర్ధారించారు. మరో విషయమేంటంటే ఇండియన్ ప్లేట్ మయన్మార్ వాయవ్య దిశగా ఉన్న పర్వతాల అడుగు భాగంలోని పొరల్లో ఇరుక్కొని పోయిందని (లాక్ అయిందని) తేల్చారు. అందువల్లే యూరేషియా ప్లేట్ కిందికి దిశ మార్చుకుందేమోనని అనుమానిస్తున్నారు. భూమి అడుగు పొరల్లో ఎలాస్టిక్ ఎనర్జీ (స్థితిస్థాపక శక్తి) క్రమంగా పుంజుకుంటోందని, ఈ పరిణామం ఉపఖండంలోని ప్రజలకు చాలా ప్రమాదకరమని ఢాకా యూనివర్సిటీలోని సిస్మాలజిస్టు సయ్యద్ హుమాయూన్ అఖ్తర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఢాకాలో ఇళ్లు, కట్టడాల నిర్మాణాల్లో నిబంధనలు ఎప్పుడో గాలికొదిలేశారు. భూకంపాలు ఏర్పడ్డప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించలేదు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా లేవు. ఇదే ఇప్పుడు బంగ్లాదేశ్ ను భయపెడుతోంది. 2015లో నేపాల్లో 7.8 పాయింట్ల భూకంపం సంభవించినప్పుడు భవనాలు ఒరిగిపోవడంతో ఆ భయానికి చాలా మంది గుండెలు ఆగిపోయి మరణించారు. జనంలో ఏర్పడ్డ తొక్కిసలాట వల్ల మరింత మంది రాలిపోయారు. అవి గుర్తు చేసుకుంటే రానున్న ప్రమాదం ఎలా ఉంటుందోనన్న ఆందోళన పీడిస్తోంది.
                      ఈ అధ్యయనంలో తేలిన ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని అధ్యయనాలు జరిపి, పరిష్కారాల కోసం అన్వేషణ మొదలు కావచ్చు. కొండలు, లోయలతో ఉన్న ప్రాంతం సహజంగానే భూకంపాలకు ఎక్కువ అవకాశం కలిగి ఉంటుంది. కానీ.. భౌగోళికంగా మిశ్రమ లక్షణాలున్న ఉపఖండ భూభాగంలో భూకంపాలు ఏర్పడే సంభావ్యత ఎందుకుంది?మిలియన్ల సంవత్సరాల కింద భోగళంలో చోటు చేసుకున్న పరిణామాలే అందుకు కారణమా? అనే కోణాల్లో అధ్యయనం చేసే వీలు ఏర్పడింది.

ఈ కాలం పిల్లలకు తూటాలంటే భయం లేదు

కాశ్మీర్ అంశం కొలిక్కి వస్తున్నదని భావిస్తున్న తరుణంలో అక్కడి పౌరుల మనోభావాలెలా ఉన్నాయనేది ఆసక్తి గొలిపే అంశం. దాన్ని బట్టే తాజా అఖిలపక్ష చర్చలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయనేది అంచనా వేయడానికి వీలవుతుంది. జులై 8న హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తరువాత నెలరోజులకు పైగా ఎడతెరిపి లేని అల్లర్లు, కర్ఫ్యూలోనూ రోడ్డెక్కిన కాశ్మీరీ యువకులు.. ఇలాంటివన్నీ చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. 15 ఏళ్ల వయసులోనే ప్రత్యేక కాశ్మీర్ ఉద్యమం కోసం బుర్హాన్ వనీ ఇల్లొదిలి వెళ్లిపోయాడంటే అక్కడి కొత్త రక్తంలో వేర్పాటు బీజాలు ఎంత బలంగా నాటుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. బుర్హాన్ తో పాటు అంతకుముందే ఓ కూతురిని, కొడుకును ఎన్ కౌంటర్లో కోల్పోయిన తండ్రి ముజఫర్ వనీ మనోభావాలు రగులుతున్న కాశ్మీర్ లోతుపాతులు తెలియజేస్తున్నాయి.
1స్క్రోల్ (డాట్) ఇన్ అనే న్యూస్ పోర్టల్ కు ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో ముజఫర్ వనీ తన  మనోభావాలు ఆవిష్కరించాడు. కాశ్మీర్ యువకుల్లో పెరుగుతున్న స్వేచ్ఛా కాంక్ష ఎంతబలంగా ఉందీ, తాజా చర్చలు ఎంతవరకు ఫలిస్తాయో అర్థం చేసుకునేందుకు ఆయన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలను విశ్లేషించుకోవడం మంచిది. తన కుమారుడు బుర్హాన్ వనీ పోలీసులకు చిక్కితే ప్రత్యేక కాశ్మీర్ ఉద్యమం పదేళ్లు వెనక్కి వెళ్లేదని, కానీ ఎన్ కౌంటర్లో చనిపోవడం వల్ల ఉద్యమం 20 ఏళ్లు ముందుకెళ్లినట్లయిందని సంతృప్తిని వ్యక్తం చేశాడు. స్వేచ్ఛా పోరాటంలో ప్రాణాలు వదిలిన కొడుకు తప్పకుండా స్వర్గ సుఖాలు అనుభవిస్తాడని గర్వంగా చెప్పుకుంటున్నాడు ముజఫర్. సెకండరీ పాఠశాలలో గణితం బోధించే ముజఫర్ మసీదులో ఖురాన్ కూడా బోధిస్తాడు. పూర్తి సంప్రదాయవాది అయిన ఆయన కాశ్మీర్ ను గురించి ఏమంటాడంటే..ఇది అల్లాకు నిలయమైన అందమైన భూమి. ఇక్కడ ఎవరూ బాధలు అనుభవించరాదు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలి. షరియా ప్రకారం మా పాలన మేం సాగించుకుంటాం. మా మీద ఎవరి పెత్తనమూ అక్కర్లేదు. అందుకే భారత్ నుంచి మేం వీలైనంత తొందరగా వేరు పడాలి. అది జరిగిన తరువాతనే మా పరిపాలన ఎలా ఉండాలో మేం నిర్ణయించుకుంటాం. అంతే కానీ.. మా పరిపాలనా విధానాలు నిర్ణయమైం తరువాత వేర్పాటుపై చర్చిస్తామనడం సరికాదు. మేం ఎలా ఉండాలో మాకు అర్థం అయ్యేందుకు రెండు, మూడు నెలలు, ఆరు నెలలు, కాదంటే ఏడాది పట్టొచ్చు. అయినా సరే. మేం స్వాతంత్ర్యం పొందిన తరువాత మాది మేం చూసుకుంటాం. మా కాలంలో మేం పోరాటాలకు భయపడేవాళ్లం. తుపాకి చూస్తే పారిపోయేవాళ్లం. కానీ ఇప్పుడు పిల్లలు చిన్నతనం నుంచే తుపాకులతో ఆటాడుకుంటున్నారు. ప్రతిరోజూ వాటి శబ్దంతోనే మేల్కొంటున్నారు. అందుకే తుపాకులకు ఎదురీదుతూ భారత సైన్యం మీద రాళ్ల దాడులు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బలప్రయోగం ద్వారా ఉద్యమాన్ని అణచాలనుకుంటే అది అయ్యే పనేనా? అని అడుగుతున్నాడు.. ముజఫర్.
          కొడుకు చనిపోయిన దగ్గర్నుంచీ ముజఫర్ ఇంటికి రోజూ చాలా మంది యువకులు రావడం బుర్హాన్ ను అమరవీరుడిగా కీర్తిస్తూ నినాదాలు చేయడం, ర్యాలీలు తీయడం, నిరసనలు తెలపడం జరుగుతోంది. బుర్హాన్ పోయాక ఈ ఉద్యమానికి నేతృత్వం వహించాల్సిందిగా వారు తనను కోరుతున్నారని ముజఫర్ చెబుతున్నాడు. అయితే అది తన పని కాదని, ఇప్పుడు రాజకీయ నాయకులే దాన్ని చూసుకోవాలంటున్నాడు. ఇప్పుడున్న పీడీపీ ప్రభుత్వమైనా, అంతకు ముందున్న ఎన్సీ ప్రభుత్వమైనా ఎన్నికల్లో ప్రతిసారీ కాశ్మీర్ స్వాతంత్ర్యం కోసం హామీలు గుప్పిస్తున్నారని, అవి నెరవేర్చే సమయం ఇప్పుడు ఆసన్నమైందని ముజఫర్ కుండబద్దలు కొడుతున్నాడు. అంతేకాదు.. అఖిలపక్షం చర్చల్లో కాశ్మీర్లోని అన్ని వర్గాలు పాల్గొనాలని, వారితోపాటు పాకిస్తాన్ కూడా ఉండాలంటాడాయన. చర్చల్లో పాకిస్తాన్ ను భాగం చేయకుండా కాశ్మీర్ కు ఎలాంటి పరిష్కారం రాబోదని ఆయన గట్టిగా వాదిస్తాడు. స్థానిక ఎన్సీ, పీడీపీ పార్టీలతో పాటు హురియత్ నేతలు కూడా చర్చల్లో పాల్గొనాలనేది ఆయన డిమాండ్.
దీన్నిబట్టి కాశ్మీర్ సమస్యకు పరిష్కారం పాకిస్తాన్ ను ఒప్పించడం లేదా, తప్పించడం మీద ఆధారపడి మాత్రమే ఉందనేది స్పష్టమవుతోంది. పాక్ అండ లేకుండా కాశ్మీరీ ముస్లిం యువకులు ఇంత సుదీర్ఘకాలం ఉద్యమం నడపడం అసంభవం. అటు పాక్ పాలకులు కూడా కాశ్మీర్ పాక్ లో విలీనమయ్యే రోజులు సమీపించాయంటుండగా.. అది కలలోని మాటగా భారత్ అంతే దృఢంగా తిప్పికొడుతోంది. అంతర్గత అలజడులతో, వారినికో భీకరమైన దాడి చొప్పున ఉగ్రవాదులు పాక్ భూమ్మీదనే పెట్రేగుతుంటే దాన్నుంచి బయటపడటం చేతకాని పాక్ పాలకులు… కాశ్మీర్ స్వాతంత్ర్యం కోసం ఎందుకు ఆరాటపడుతున్నారో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఇప్పటికే కాశ్మీర్లోని చాలా భూభాగాన్ని అదుపులో పెట్టుకున్న పాక్ (పీఓకే) ఇకపై కాశ్మీర్ ను పూర్తిగా చేతుల్లోకి తీసుకొని భారత్ కు మరిన్ని సమస్యలు సృష్టించాలని భావిస్తోంది. కాశ్మీర్ విడిపోయే దాకా భారత్ తో చర్చల ద్వారానో, చొరబాట్లను ప్రోత్సహించడం ద్వారానో కీలకంగా వ్యవహరించాలుకుంటున్న పాక్.. ఆ సమస్యకు పరిష్కారం దొరికిన తరువాత కాశ్మీర్ అండతో భారత్ ను టార్గెట్ చేసే ప్రమాదముంది. ఎందుకంటే.. పూర్తి స్వాతంత్ర్యం కావాలంటున్న కాశ్మీరీ వేర్పాటువాదులు కనీసం భారత్, పాక్ లకు సమానదూరం పాటించాలని అనుకోవడం లేదు. పాక్ అండతోనే అల్లర్లకు తెగబడుతున్నారు. కాబట్టి ఇక్కడ పాక్ తో కలిపి కాశ్మీర్ వేర్పాటును కోరుకునే అందరిదీ ఒకే డిమాండ్ గా కనిపిస్తుండగా.. ఇండియా మాత్రం సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకుంటూనే సామరస్య పరిష్కారానికి మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో బీజేపీతో అధికారం పంచుకుంటున్న పీడీపీ (సీఎం మెహబూబా ముఫ్తీ) మరింత క్రియాశీలంగా, చిత్తశుద్ధితో వ్యవహరించాల్సి ఉంటుంది. కాశ్మీరీ ముస్లింలలో భారత్ మీద నమ్మకం పెంచి హురియత్ ను నిదానంగా దారికి తెచ్చుకోవడంతో పాటు, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద  సంస్థలకు అండగా నిలుస్తున్న పాక్ ప్రమేయాన్ని తగ్గించాలి. ముస్లింలలో పసిపిల్లల దగ్గర్నుంచి ప్రత్యేక కాశ్మీర్ ను కోరుకుంటున్నప్పుడు ఇదంత సులభ సాధ్యమైన పనిగా కనిపించడం లేదు. కాశ్మీర్ కు బయటి నుంచి అన్ని రకాల దారులూ మూసేసి, అసలైన రక్షకులు భారత పాలకులేనని మనసా, వాచా, కర్మణా కాశ్మీరీలకు నమ్మకం కలిగించాలి. ఆ దిశగా అడుగులు పడినప్పుడే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం దగ్గరవుతుంది.

Read more

ఈ కాలం పిల్లలకు తూటాలంటే భయం లేదు

                 కాశ్మీర్ అంశం కొలిక్కి వస్తున్నదని భావిస్తున్న తరుణంలో అక్కడి పౌరుల మనోభావాలెలా ఉన్నాయనేది ఆసక్తి గొలిపే అంశం. దాన్ని బట్టే తాజా అఖిలపక్ష చర్చలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయనేది అంచనా వేయడానికి వీలవుతుంది. జులై 8న హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తరువాత నెలరోజులకు పైగా ఎడతెరిపి లేని అల్లర్లు, కర్ఫ్యూలోనూ రోడ్డెక్కిన కాశ్మీరీ యువకులు.. ఇలాంటివన్నీ చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. 15 ఏళ్ల వయసులోనే ప్రత్యేక కాశ్మీర్ ఉద్యమం కోసం బుర్హాన్ వనీ ఇల్లొదిలి వెళ్లిపోయాడంటే అక్కడి కొత్త రక్తంలో వేర్పాటు బీజాలు ఎంత బలంగా నాటుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. బుర్హాన్ తో పాటు అంతకుముందే ఓ కూతురిని, కొడుకును ఎన్ కౌంటర్లో కోల్పోయిన తండ్రి ముజఫర్ వనీ మనోభావాలు రగులుతున్న కాశ్మీర్ లోతుపాతులు తెలియజేస్తున్నాయి.
3
పిల్లల్ని కోల్పోయిన ఫీలింగ్స్ కనిపించని ముజఫర్ వనీ

 

                   స్క్రోల్ (డాట్) ఇన్ అనే న్యూస్ పోర్టల్ కు ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో ముజఫర్ వనీ తన  మనోభావాలు ఆవిష్కరించాడు. కాశ్మీర్ యువకుల్లో పెరుగుతున్న స్వేచ్ఛా కాంక్ష ఎంతబలంగా ఉందీ, తాజా చర్చలు ఎంతవరకు ఫలిస్తాయో అర్థం చేసుకునేందుకు ఆయన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలను విశ్లేషించుకోవడం మంచిది. తన కుమారుడు బుర్హాన్ వనీ పోలీసులకు చిక్కితే ప్రత్యేక కాశ్మీర్ ఉద్యమం పదేళ్లు వెనక్కి వెళ్లేదని, కానీ ఎన్ కౌంటర్లో చనిపోవడం వల్ల ఉద్యమం 20 ఏళ్లు ముందుకెళ్లినట్లయిందని సంతృప్తిని వ్యక్తం చేశాడు. స్వేచ్ఛా పోరాటంలో ప్రాణాలు వదిలిన కొడుకు తప్పకుండా స్వర్గ సుఖాలు అనుభవిస్తాడని గర్వంగా చెప్పుకుంటున్నాడు ముజఫర్. సెకండరీ పాఠశాలలో గణితం బోధించే ముజఫర్ మసీదులో ఖురాన్ కూడా బోధిస్తాడు. పూర్తి సంప్రదాయవాది అయిన ఆయన కాశ్మీర్ ను గురించి ఏమంటాడంటే..ఇది అల్లాకు నిలయమైన అందమైన భూమి. ఇక్కడ ఎవరూ బాధలు అనుభవించరాదు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలి. షరియా ప్రకారం మా పాలన మేం సాగించుకుంటాం. మా మీద ఎవరి పెత్తనమూ అక్కర్లేదు. అందుకే భారత్ నుంచి మేం వీలైనంత తొందరగా వేరు పడాలి. అది జరిగిన తరువాతనే మా పరిపాలన ఎలా ఉండాలో మేం నిర్ణయించుకుంటాం. అంతే కానీ.. మా పరిపాలనా విధానాలు నిర్ణయమైం తరువాత వేర్పాటుపై చర్చిస్తామనడం సరికాదు. మేం ఎలా ఉండాలో మాకు అర్థం అయ్యేందుకు రెండు, మూడు నెలలు, ఆరు నెలలు, కాదంటే ఏడాది పట్టొచ్చు. అయినా సరే. మేం స్వాతంత్ర్యం పొందిన తరువాత మాది మేం చూసుకుంటాం. మా కాలంలో మేం పోరాటాలకు భయపడేవాళ్లం. తుపాకి చూస్తే పారిపోయేవాళ్లం. కానీ ఇప్పుడు పిల్లలు చిన్నతనం నుంచే తుపాకులతో ఆటాడుకుంటున్నారు. ప్రతిరోజూ వాటి శబ్దంతోనే మేల్కొంటున్నారు. అందుకే తుపాకులకు ఎదురీదుతూ భారత సైన్యం మీద రాళ్ల దాడులు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బలప్రయోగం ద్వారా ఉద్యమాన్ని అణచాలనుకుంటే అది అయ్యే పనేనా? అని అడుగుతున్నాడు.. ముజఫర్.

         

1
హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో కమాండర్ బుర్హాన్ వనీ

   కొడుకు చనిపోయిన దగ్గర్నుంచీ ముజఫర్ ఇంటికి రోజూ చాలా మంది యువకులు రావడం బుర్హాన్ ను అమరవీరుడిగా కీర్తిస్తూ నినాదాలు చేయడం, ర్యాలీలు తీయడం, నిరసనలు తెలపడం జరుగుతోంది. బుర్హాన్ పోయాక ఈ ఉద్యమానికి నేతృత్వం వహించాల్సిందిగా వారు తనను కోరుతున్నారని ముజఫర్ చెబుతున్నాడు. అయితే అది తన పని కాదని, ఇప్పుడు రాజకీయ నాయకులే దాన్ని చూసుకోవాలంటున్నాడు. ఇప్పుడున్న పీడీపీ ప్రభుత్వమైనా, అంతకు ముందున్న ఎన్సీ ప్రభుత్వమైనా ఎన్నికల్లో ప్రతిసారీ కాశ్మీర్ స్వాతంత్ర్యం కోసం హామీలు గుప్పిస్తున్నారని, అవి నెరవేర్చే సమయం ఇప్పుడు ఆసన్నమైందని ముజఫర్ కుండబద్దలు కొడుతున్నాడు. అంతేకాదు.. అఖిలపక్షం చర్చల్లో కాశ్మీర్లోని అన్ని వర్గాలు పాల్గొనాలని, వారితోపాటు పాకిస్తాన్ కూడా ఉండాలంటాడాయన. చర్చల్లో పాకిస్తాన్ ను భాగం చేయకుండా కాశ్మీర్ కు ఎలాంటి పరిష్కారం రాబోదని ఆయన గట్టిగా వాదిస్తాడు. స్థానిక ఎన్సీ, పీడీపీ పార్టీలతో పాటు హురియత్ నేతలు కూడా చర్చల్లో పాల్గొనాలనేది ఆయన డిమాండ్.

దీన్నిబట్టి కాశ్మీర్ సమస్యకు పరిష్కారం పాకిస్తాన్ ను ఒప్పించడం లేదా, తప్పించడం మీద ఆధారపడి మాత్రమే ఉందనేది స్పష్టమవుతోంది. పాక్ అండ లేకుండా కాశ్మీరీ ముస్లిం యువకులు ఇంత సుదీర్ఘకాలం ఉద్యమం నడపడం అసంభవం. అటు పాక్ పాలకులు కూడా కాశ్మీర్ పాక్ లో విలీనమయ్యే రోజులు సమీపించాయంటుండగా.. అది కలలోని మాటగా భారత్ అంతే దృఢంగా తిప్పికొడుతోంది. అంతర్గత అలజడులతో, వారినికో భీకరమైన దాడి చొప్పున ఉగ్రవాదులు పాక్ భూమ్మీదనే పెట్రేగుతుంటే దాన్నుంచి బయటపడటం చేతకాని పాక్ పాలకులు… కాశ్మీర్ స్వాతంత్ర్యం కోసం ఎందుకు ఆరాటపడుతున్నారో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఇప్పటికే కాశ్మీర్లోని చాలా భూభాగాన్ని అదుపులో పెట్టుకున్న పాక్ (పీఓకే) ఇకపై కాశ్మీర్ ను పూర్తిగా చేతుల్లోకి తీసుకొని భారత్ కు మరిన్ని సమస్యలు సృష్టించాలని భావిస్తోంది. కాశ్మీర్ విడిపోయే దాకా భారత్ తో చర్చల ద్వారానో, చొరబాట్లను ప్రోత్సహించడం ద్వారానో కీలకంగా వ్యవహరించాలుకుంటున్న పాక్.. ఆ సమస్యకు పరిష్కారం దొరికిన తరువాత కాశ్మీర్ అండతో భారత్ ను టార్గెట్ చేసే ప్రమాదముంది. ఎందుకంటే.. పూర్తి స్వాతంత్ర్యం కావాలంటున్న కాశ్మీరీ వేర్పాటువాదులు కనీసం భారత్, పాక్ లకు సమానదూరం పాటించాలని అనుకోవడం లేదు. పాక్ అండతోనే అల్లర్లకు తెగబడుతున్నారు. కాబట్టి ఇక్కడ పాక్ తో కలిపి కాశ్మీర్ వేర్పాటును కోరుకునే అందరిదీ ఒకే డిమాండ్ గా కనిపిస్తుండగా.. ఇండియా మాత్రం సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకుంటూనే సామరస్య పరిష్కారానికి మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో బీజేపీతో అధికారం పంచుకుంటున్న పీడీపీ (సీఎం మెహబూబా ముఫ్తీ) మరింత క్రియాశీలంగా, చిత్తశుద్ధితో వ్యవహరించాల్సి ఉంటుంది. కాశ్మీరీ ముస్లింలలో భారత్ మీద నమ్మకం పెంచి హురియత్ ను నిదానంగా దారికి తెచ్చుకోవడంతో పాటు, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద  సంస్థలకు అండగా నిలుస్తున్న పాక్ ప్రమేయాన్ని తగ్గించాలి. ముస్లింలలో పసిపిల్లల దగ్గర్నుంచి ప్రత్యేక కాశ్మీర్ ను కోరుకుంటున్నప్పుడు ఇదంత సులభ సాధ్యమైన పనిగా కనిపించడం లేదు. కాశ్మీర్ కు బయటి నుంచి అన్ని రకాల దారులూ మూసేసి, అసలైన రక్షకులు భారత పాలకులేనని మనసా, వాచా, కర్మణా కాశ్మీరీలకు నమ్మకం కలిగించాలి. ఆ దిశగా అడుగులు పడినప్పుడే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం దగ్గరవుతుంది.

డిప్రెషన్ కు కారణమేంటో తెలిసిపోయిందోచ్! 

Depression.jpg               మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతూ ఇంటిల్లిపాదికీ సమస్యగా మారే కోట్లాది మంది ఇకపై బాధపడాల్సిన పన్లేదు. మిగతా అందరిలాగే ఇకపై వారు కూడా పూర్తి మానసిక ఆరోగ్యంతో పోటీపడే సమయం ఆసన్నమైంది. అమెరికాలోని పిట్స్ బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పలువురు ప్రొఫెసర్లు కొన్నేళ్లుగా జరుపుతున్న పరిశోధనలు ఫలించాయి. డిప్రెషన్ కు అసలు కారణమేంటో తెలిసిపోయింది. వారి పరిశోధన వివరాలను అమెరికా జర్నల్ ఆఫ్ సైకియాట్రీ ప్రచురించడం విశేషం.  
పిట్స్ బర్గ్ వైద్య పాఠశాలకు చెందిన లీసా పాన్, డేవిడ్ బ్రెంట్ అనే ప్రొఫెసర్లు డిప్రెషన్ తో బాధపడుతున్న ఓ టీనేజ్ విద్యార్థికి చికిత్స మొదలుపెట్టారు. ఆ విద్యార్థి గతంలో అనేక సందర్భాల్లో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అదృష్టవశాత్తూ ఆత్మహత్యా ప్రయత్నాలు ఫెయిలవడంతో ఆ కేసు వీరి దగ్గరికి రావడం, పరిశోధనకు అవకాశం ఏర్పడడం జరిగింది. ఆ టీనేజ్ అబ్బాయి మీద ఐదేళ్ల క్రితం మొదలైన ట్రీట్ మెంట్ ఎంతకూ సత్ఫలితాలివ్వలేదు. అందుబాటులో ఉన్న, వారికి తెలిసిన మందులు వాడడం, సైకియాట్రిస్టుల చేత థెరపీ ఇవ్వడం జరిగిపోయాయి. అయినా ఆ అబ్బాయిలో మార్పు రాలేదు. ఈ కేసునే ఛాలెంజ్ గా తీసుకొని వారు మరిన్ని పరిశోధనలు చేశారు. వారు  ఈసారి మానసిక కోణంలో కాకుండా పేషెంట్ జీవక్రియల కోణం మీద దృష్టి సారించారు. అంటే మానసిక ప్రవర్తనలకు కారణమయ్యే జీవక్రియల మీద పరిశోధనలు సాగించారన్నమాట. అందులో తేలిందేమంటే మెదడును, నాడీవ్యవస్థను నియంత్రించే ఒక రకమైన ఫ్లూయిడ్ లోపమే ఈ డిప్రెషన్ కు కారణమవుతోందని గుర్తించారు. ఆ ఫ్లూయిడ్ లో బయోప్టరిన్ అనే ప్రొటీన్ ఉందని, అదే మానసిక రుగ్మతలకు దారితీస్తోందని, పేషెంట్ల జీవితాల్లో అశాంతికి కారణమవుతోందని గుర్తించారు. ఆ లోపాన్ని సరిచేయడం వల్లనే టీనేజీ అబ్బాయి డిప్రెషన్ నుంచి బయట పడ్డాడని, ఇప్పుడు అందరిలాగే బుద్ధిగా కాలేజీకి వెళ్తున్నాడని పిట్స్ బర్గ్ ప్రొఫెసర్లు గర్వంగా చెబుతున్నారు.  
                     ఆ ప్రొటీన్ అసమతుల్యంగా ఉన్న కారణంగా డిప్రెషన్ తో బాధపడుతున్న అనేక మందిలో జీవక్రియా వ్యవస్థ అసాధారణంగా ఉన్నట్టు వీరు గుర్తించారు. అంతేకాదు… మెదడు నుంచి శరీరానికి సంకేతాలు చేరవేయడంలో  16 ఆటంకాలను (నియంత్రిత స్థానాలు) కూడా తాజా పరిశోధనల్లో గుర్తించడం విశేషం. 64 శాతం డిప్రెషన్ బాధితులకు ఆ 16 ఆటంకాలే కారణమని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నియంత్రిత స్థానాలు లేనివారిలో డిప్రెషన్ డిజార్డర్స్ చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. బయోప్టరిన్ చికిత్స తీసుకున్న పేషెంట్లలో చాలామందికి డిప్రెషన్ తగ్గిందని, మరికొందరికయితే పూర్తి ఉపశమనం చేకూరిందని చెబుతున్నారు. చికిత్స పనిచేయడం ప్రారంభించిన తరువాత ఎంత ఎక్కువ కాలం చికిత్స తీసుకుంటే అంత మంచి ఫలితాలు వస్తున్నట్లు పిట్స్ బర్గ్ పరిశోధకులు చెబుతున్నారు.  
 

                డిప్రెషన్ బాధితులు  

                ప్రపంచంలో మూడింట రెండొంతుల ఆత్మహత్యలకు డిప్రెషనే కారణం. డిప్రెషన్ తో బాధపడుతున్నవారి సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. దీంతో అనేక కుటుంబాల్లో అశాంతి నెలకొంటోంది. అవాంఛనీయ సంఘటనలకూ దారితీస్తోంది. ఇప్పుడు అమల్లో ఉన్న, అందరూ అనుసరిస్తున్న వైద్య విధానం వల్ల (మందులు ఇవ్వడం, సైకో థెరపీ చేయడం వంటివి) 15 శాతం మంది రోగులకు జబ్బు నయం కావడం లేదని తమ పరిశోధనలో తేలిందని, ఈ పరిశోధన ఇచ్చిన ప్రోత్సాహంతో మరింత ముందుకెళ్తామని లీసా పాన్ అంటున్నారు. గతంలో తాము చికిత్స చేసినా ఫలితం దక్కని పాత పేషెంట్లను మళ్లీ పిలిపించి బయోప్టరిన్ స్థాయిని అధ్యయనం చేసి ఆ మేరకు ట్రీట్ మెంట్ చేస్తామంటున్నారు. మొత్తానికి తాజా పరిశోధనల వల్ల ఎంతోమంది డిప్రెషన్ బాధితుల జీవితాల్లో వెలుగులు పూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.