Depression.jpg               మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతూ ఇంటిల్లిపాదికీ సమస్యగా మారే కోట్లాది మంది ఇకపై బాధపడాల్సిన పన్లేదు. మిగతా అందరిలాగే ఇకపై వారు కూడా పూర్తి మానసిక ఆరోగ్యంతో పోటీపడే సమయం ఆసన్నమైంది. అమెరికాలోని పిట్స్ బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పలువురు ప్రొఫెసర్లు కొన్నేళ్లుగా జరుపుతున్న పరిశోధనలు ఫలించాయి. డిప్రెషన్ కు అసలు కారణమేంటో తెలిసిపోయింది. వారి పరిశోధన వివరాలను అమెరికా జర్నల్ ఆఫ్ సైకియాట్రీ ప్రచురించడం విశేషం.  
పిట్స్ బర్గ్ వైద్య పాఠశాలకు చెందిన లీసా పాన్, డేవిడ్ బ్రెంట్ అనే ప్రొఫెసర్లు డిప్రెషన్ తో బాధపడుతున్న ఓ టీనేజ్ విద్యార్థికి చికిత్స మొదలుపెట్టారు. ఆ విద్యార్థి గతంలో అనేక సందర్భాల్లో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అదృష్టవశాత్తూ ఆత్మహత్యా ప్రయత్నాలు ఫెయిలవడంతో ఆ కేసు వీరి దగ్గరికి రావడం, పరిశోధనకు అవకాశం ఏర్పడడం జరిగింది. ఆ టీనేజ్ అబ్బాయి మీద ఐదేళ్ల క్రితం మొదలైన ట్రీట్ మెంట్ ఎంతకూ సత్ఫలితాలివ్వలేదు. అందుబాటులో ఉన్న, వారికి తెలిసిన మందులు వాడడం, సైకియాట్రిస్టుల చేత థెరపీ ఇవ్వడం జరిగిపోయాయి. అయినా ఆ అబ్బాయిలో మార్పు రాలేదు. ఈ కేసునే ఛాలెంజ్ గా తీసుకొని వారు మరిన్ని పరిశోధనలు చేశారు. వారు  ఈసారి మానసిక కోణంలో కాకుండా పేషెంట్ జీవక్రియల కోణం మీద దృష్టి సారించారు. అంటే మానసిక ప్రవర్తనలకు కారణమయ్యే జీవక్రియల మీద పరిశోధనలు సాగించారన్నమాట. అందులో తేలిందేమంటే మెదడును, నాడీవ్యవస్థను నియంత్రించే ఒక రకమైన ఫ్లూయిడ్ లోపమే ఈ డిప్రెషన్ కు కారణమవుతోందని గుర్తించారు. ఆ ఫ్లూయిడ్ లో బయోప్టరిన్ అనే ప్రొటీన్ ఉందని, అదే మానసిక రుగ్మతలకు దారితీస్తోందని, పేషెంట్ల జీవితాల్లో అశాంతికి కారణమవుతోందని గుర్తించారు. ఆ లోపాన్ని సరిచేయడం వల్లనే టీనేజీ అబ్బాయి డిప్రెషన్ నుంచి బయట పడ్డాడని, ఇప్పుడు అందరిలాగే బుద్ధిగా కాలేజీకి వెళ్తున్నాడని పిట్స్ బర్గ్ ప్రొఫెసర్లు గర్వంగా చెబుతున్నారు.  
                     ఆ ప్రొటీన్ అసమతుల్యంగా ఉన్న కారణంగా డిప్రెషన్ తో బాధపడుతున్న అనేక మందిలో జీవక్రియా వ్యవస్థ అసాధారణంగా ఉన్నట్టు వీరు గుర్తించారు. అంతేకాదు… మెదడు నుంచి శరీరానికి సంకేతాలు చేరవేయడంలో  16 ఆటంకాలను (నియంత్రిత స్థానాలు) కూడా తాజా పరిశోధనల్లో గుర్తించడం విశేషం. 64 శాతం డిప్రెషన్ బాధితులకు ఆ 16 ఆటంకాలే కారణమని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నియంత్రిత స్థానాలు లేనివారిలో డిప్రెషన్ డిజార్డర్స్ చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. బయోప్టరిన్ చికిత్స తీసుకున్న పేషెంట్లలో చాలామందికి డిప్రెషన్ తగ్గిందని, మరికొందరికయితే పూర్తి ఉపశమనం చేకూరిందని చెబుతున్నారు. చికిత్స పనిచేయడం ప్రారంభించిన తరువాత ఎంత ఎక్కువ కాలం చికిత్స తీసుకుంటే అంత మంచి ఫలితాలు వస్తున్నట్లు పిట్స్ బర్గ్ పరిశోధకులు చెబుతున్నారు.  
 

                డిప్రెషన్ బాధితులు  

                ప్రపంచంలో మూడింట రెండొంతుల ఆత్మహత్యలకు డిప్రెషనే కారణం. డిప్రెషన్ తో బాధపడుతున్నవారి సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. దీంతో అనేక కుటుంబాల్లో అశాంతి నెలకొంటోంది. అవాంఛనీయ సంఘటనలకూ దారితీస్తోంది. ఇప్పుడు అమల్లో ఉన్న, అందరూ అనుసరిస్తున్న వైద్య విధానం వల్ల (మందులు ఇవ్వడం, సైకో థెరపీ చేయడం వంటివి) 15 శాతం మంది రోగులకు జబ్బు నయం కావడం లేదని తమ పరిశోధనలో తేలిందని, ఈ పరిశోధన ఇచ్చిన ప్రోత్సాహంతో మరింత ముందుకెళ్తామని లీసా పాన్ అంటున్నారు. గతంలో తాము చికిత్స చేసినా ఫలితం దక్కని పాత పేషెంట్లను మళ్లీ పిలిపించి బయోప్టరిన్ స్థాయిని అధ్యయనం చేసి ఆ మేరకు ట్రీట్ మెంట్ చేస్తామంటున్నారు. మొత్తానికి తాజా పరిశోధనల వల్ల ఎంతోమంది డిప్రెషన్ బాధితుల జీవితాల్లో వెలుగులు పూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s